Thursday, December 4, 2008

.అమ్మాయి అందం"

నేలకు నిచ్చెన వేసి భువికి దిగి వచ్చిన దేవకన్యవో

నీ అందానికి బానిసనై వెంట వచ్చిన మన్మధుడినే

నెమలి కన్నుల నెరజానవో

తీపి పెదవుల తేనెటీగవో

పురివిప్పిన నీ అందాలతో మైమరచెను నా మనసే

చిరుగాలిలా నీ చూపులు తడిమెను నా గుండెనే

రంభ ఊర్వశి మేనకలైనా తలదించులోర నీ అందం చూసి

ఆ దేవేంద్రుడే దిగిరాడా నీ ఒంపుల సొగసును కనేసి

కోటి దివ్వెల కాంతులే నిండెను నీ ముఖారవిందానా

నవరత్నాలే రాలిపోఎను నీ చిరుమందహాసాన

నీ ముఖం చూసి జాబిలే మబ్బు చాటుకు జారిపొదా
నీ కన్నుల వెలుగును చూసి చుక్కలే సిగ్గుతో మాయమైపోవా

సంగీతం అంటే ....

శ్రావ్యమైన శ్రుతులతో లయల హొయలతో
సాగే గీతమే సంగీతం
స్వరాల సారంతో తాళాల మేళంతో
జారే ఝరుల జలపాతమే సంగీతం
ప్రకృతిని పులకించే వసంతాన
పరవశించే కోయిల గానమే సంగీతం
మందార తోటలోన మకరంద వేటలోన
తుమ్మెద పాడే తియ్యని గానమే సంగీతం
రాగతాళాలు లేని నాట్యం నటనే కదా
నటనను నృత్యంగా మలిచేది సంగీతం కాదా
సృష్టికి మూలం ఓంకారం
ప్రణవనాదం పలికించే భావమే సంగీతం
అణువణువును కదిలించేది ,జగతిని సైతం మేల్కొల్పునది
సప్త స్వరాలతో అష్ట దిశలలో నవరసాలను పండించీసాధనమేసంగీతం
భాషకి అందని భావమే సంగీతం
తరగని నిధుల పయోనిధి సంగీతం

స్నేహానికి ప్రాణమిచ్చిన మిత్రుడికి అంకితం .....

మన స్నేహం చిరకాలం నిలవాలని...
కనిపించని శిఖరాలకు చేరుకొన్నావు...
తిరిగి రాని తీరాలకు తరలిపోయావు ...
.....నీ ప్రాణం తిరిగిరానిది నీ స్నేహం మరువలేనిది
......నీ నవ్వులు చెరగలేనివి నీ బాధలు కరగలేనివి
మృత్యువు నీ ప్రాణం తీస్తే
స్నేహానికి నీ ప్రాణం పోసావు
స్నేహానికి ప్రాణమిచ్చిన మిత్రమా
నిన్ను నన్ను కలిపిన విధి ఇంత చిత్రమా ...
కారే కన్నీటికి తెలియదుగా నువ్వు తిరిగి రావని
బాధపడే గుండెకు తెలియదుగా నువ్విక లేవని
నిను చేరాలని వున్నా ఏంలాభం
బ్రతుకు నన్నులాగుతోంది చావు నన్ను ఆపుతోంది
ఇక నీ మధుర స్మృతులే నా జీవితం
ఈ నా జీవితమే నీకు అంకితం .................

Wednesday, November 26, 2008

మన భారతం

కన్నీటి కడలి లో ఎన్నో బాధలు
దారిద్ర్యపు ఒడిలో మరెన్నో వ్యధలు
బాలకార్మికుల భారం తీసి
బడిపిల్లలుగా జీవం పోసి
నిర్మిద్దాం నవ సమాజాన్ని
సాధిద్దాం యువ భారతాన్ని.
........................................
...................
కదిలే సమాజం నడకలు మారగా
నడిచే నేతలు న్యాయం చేయగా
ఎనాళ్ళ కష్టాలో ఈనాటికి తొలగెను
ఏనాటి కోర్కెలో ఇన్నాళ్ళకు తీరెను
...........................................................
ఏ నాటి పుణ్యమో భారతం మనదయ్యెరా
ఏ నాటి ఋణమో ఈ జన్మభూమి సేవరా
...........................................................
మతాలలో ఐక్యత వుంటే కలహాలకు కొలువుంతుందా
జాతికి జాతి జతై కలిస్తే వివక్షలకు చోటుంటుందా
ఇక మారదు ఈ భారతం
మారితే తప్పదు నవ భారతం
.............................................................
గతంగా మారే భవిష్యత్తుకి లేవు పునాదులు
గడిచిన ఆ గతంలొ చేరలేని శిఖరాలు
పూర్వ వైభవం తెచ్చే కొరకు శ్రమిద్దాం రోజంతా
అడ్డంకులు ఎదురైనా ఎదురు నిలుద్దాం మనమంతా
........................................................................................
మిన్నంటిన సంబరాలలో నింగికెగసెను శాంతి కపోతం
అవధుల్లేని ఆనందాలలో అంబరంతాకెను జాతిపతాకం
...........................................................................................

Tuesday, November 25, 2008

వాన గురించి.......

నీలిమేఘాల నీడలోన నింగి జారెను ముత్యాలెన్నో
పరవశించే మేనుపైన జాలువారెను చినుకులెన్నో
నేలతాకిన చినుకురవ్వలె కదలికేగెను ప్రవాహమై
సూర్యభానుడి ప్రతాపానికి ఆ నీరే మింగెను ఈ మబ్బులే (అంటే ఆవిరైపోయాయి అని)
...............................................................................................
పెలపెల అలజడులే ఈ ఉరుములు
మిలమిల వెలుగురేఖలే మెరుపులు
ఉరుముమెరుపుల సరసమే ఈ వాన
కాంతి సవ్వడుల కలయికే ఈ వాన(అంటే ఉరుము,మెరుపు అని)
................................................................................................
మబ్బు కడవ లో చిద్రమే తెర్చేను ధాత్రిదాహం
హర్షించిన మానవాళి ఇక అయ్యెను దాసోహం
.................................................................................................
వాయు వరుణుల వైరమే ప్రళయం
ఆ వైరమే జీవకోటికి విషవలయం
............................................................................
అగ్నిదేవుడి ఆగ్రహానికి భయమ్తో బిక్కు బిక్కుమంటే
వరుణుడి కరుణకి శాంతించడా భగ్గు భగ్గుమనే ఈ అగ్గిరాజు
...........................................................................................................................