నేలకు నిచ్చెన వేసి భువికి దిగి వచ్చిన దేవకన్యవో
నీ అందానికి బానిసనై వెంట వచ్చిన మన్మధుడినే
నెమలి కన్నుల నెరజానవో
తీపి పెదవుల తేనెటీగవో
పురివిప్పిన నీ అందాలతో మైమరచెను నా మనసే
చిరుగాలిలా నీ చూపులు తడిమెను నా గుండెనే
రంభ ఊర్వశి మేనకలైనా తలదించులోర నీ అందం చూసి
ఆ దేవేంద్రుడే దిగిరాడా నీ ఒంపుల సొగసును కనేసి
కోటి దివ్వెల కాంతులే నిండెను నీ ముఖారవిందానా
నవరత్నాలే రాలిపోఎను నీ చిరుమందహాసాన
నీ ముఖం చూసి జాబిలే మబ్బు చాటుకు జారిపొదా
నీ కన్నుల వెలుగును చూసి చుక్కలే సిగ్గుతో మాయమైపోవా
నీ ముఖం చూసి జాబిలే మబ్బు చాటుకు జారిపొదా
నీ కన్నుల వెలుగును చూసి చుక్కలే సిగ్గుతో మాయమైపోవా