శ్రావ్యమైన శ్రుతులతో లయల హొయలతో
సాగే గీతమే సంగీతం
స్వరాల సారంతో తాళాల మేళంతో
జారే ఝరుల జలపాతమే సంగీతం
ప్రకృతిని పులకించే వసంతాన
పరవశించే కోయిల గానమే సంగీతం
మందార తోటలోన మకరంద వేటలోన
తుమ్మెద పాడే తియ్యని గానమే సంగీతం
రాగతాళాలు లేని నాట్యం నటనే కదా
ఆ నటనను నృత్యంగా మలిచేది సంగీతం కాదా
సృష్టికి మూలం ఓంకారం
ఆ ప్రణవనాదం పలికించే భావమే సంగీతం
అణువణువును కదిలించేది ,జగతిని సైతం మేల్కొల్పునది
సప్త స్వరాలతో అష్ట దిశలలో నవరసాలను పండించీసాధనమేసంగీతం
భాషకి అందని భావమే సంగీతం
తరగని నిధుల పయోనిధి సంగీతం
1 comment:
అద్భుతం. ఇంతకు మించి నేను చెప్పలేను.
మీకు ఒక వీర తాడు.
Post a Comment