Friday, March 13, 2009

ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా...........

జీవరాశులే అవతరించగా
సకల జగతే జాగృతమవగా
దేవగనమే హర్షించగా
కనక వర్షమే కురుపించగా
ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా.......
జగతికి మూలం అమ్మే కాగా
జననం మరణం కవలలు కాగా
బ్రతుకే మనకొక వరమై రాగా
చావే ముక్తికి మార్గం కగా
ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా.......
కరిగిన మబ్బులే వానై కురవంగ
కలువపై చినుకే ముత్యమై మెరువంగ
కదలి కెరతమే నింగినంటంగ
కన్నీరే లోకాన కరువైపోవంగ
ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా.......
హంస నడకలే హొయలొలికించగా
తడబడు నడకలో నాట్యం వికసించగా
గలమున తొణికిన స్వరములు వినిపించగా
కోయిల పాటకు ప్రకృతే పులకించగా
ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా.......
చిరునవ్వుతో చెలిమి చేయంగ
కన్నెటితో వీడ్కోలు పలుకంగ
కడదాకా ఒకరికొకరమై వుందంగ
మన స్నేహం చిరకాలం నిలవంగ
ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా.......
కలిసి కట్టుగా మనం నడవంగ
ఏకతాటిపై మనం నిలవంగ
దుష్ట ఉన్మాదమే పరుగులెత్తంగ
మానవాలే జేజేలు పలుకంగ
ప్రపంచమే ప్రకాశించదా........పుడమితల్లి పరవశించదా.......

1 comment:

THINKING ROBO said...

Chala Bagundhi.. Rasina vidhanam bagundhi..