Saturday, March 14, 2009

జయహో........సైనికుడా జయహో.....................

జయహో........సైనికుడా జయహో.....................
పిడికిలి బిగించి చావుకి తెగించి యుద్ధరంగంలో అడుగెట్టే వీరుడా
సమరానికి సై అంటూ విజయానికి జై అంటూ శత్రువుల గుండెల్ని చీల్చరా
వీరఖడ్గమేరా నీ ఆయుధం
వీరోచితంగా సాగించు ఈ యుద్ధం
జయహో........సైనికుడా జయహో.....................
కత్తుల ఒరలను నెత్తుటిధారతో కడిగెయ్యరా
కాలుదువ్విన కదనరంగంలొ కన్నెర్రజేయరా
శంఖారావమే సమరానికి ఆదిశబ్దం
విజయానికి ప్రతీకలే శత్రువుల నిశ్శబ్దం
జయహో........సైనికుడా జయహో.....................
పిడుగులా నీ అడుగులే దడలు పుట్టించగా
కడలిలా సైన్యమే ప్రళయమై పొంగగా
రుధిరవర్ణపు నయనాలలో విజయకంతులు వర్ధిల్లగా
సుధీర్ఘ సమరపు తుది తరుణంలొ విజయగర్జన వినిపించగా
జయహో........సైనికుడా జయహో.....................

3 comments:

Anonymous said...

arey superb ra......mind blowin....i believe ppl who r into creative writin r really blessed......amazing wrks......try publishin dem in papers...my serious suggestion is to concentrate more on ur writings.......damn still cant understand wat u doin in our cseB class (lol's....:-p :p)...ppl out der in da creative industr r waitin for u.....wishin u all da bst...vmzi®

హను said...

nice chala baaga rasru, expelenation chala bagumdi

Manikanta said...

Good Writup man :) keep it up